Police are filing cases against: Former CM Jagan
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం
పోలీసులే ఎదురు కేసులు పెడుతున్నారు: మాజీ సీఎం జగన్
Trinethram News : Andhra Pradesh : ‘రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం చంద్రబాబు ప్రోద్భలంతోనే దాడులు జరుగుతున్నాయి’ అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లి జగన్ నివాస ప్రాంగణంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో ఆయన సమావేశంఅయ్యారు. ‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లో భయాందోళనలను కలిగిస్తున్నారు. రాష్ట్రంలో పై స్థాయి నుంచి కింది వరకూ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఎవరిని తొక్కాలో, ఎవరిని నాశనం చేయాలో, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి?
అన్న ఆంశాల మీద పై నుంచి కింద స్థాయి దాకా రెడ్‌బుక్ తయారయింది. పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు వెళితే బాధితులపైనే పోలీసులు ఎదురు కేసులు పెడతున్నారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి వెళ్తే కేసులు పెడుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. వైసీసీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైసీపీ లీగల్ సెల్ ఎప్పటికప్పడు న్యాయస్థానాల్లో కేసులు వేయాలి’ అని జగన్ పిలుపు ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App