
*కుందనపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ సందర్శించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
అంతర్గాం, ఫిబ్రవరి-25: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పర్యాటకులను ఆకర్షించేలా కుందనపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అంతర్గాం మండలం కుందనపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్కును సందర్శించారు. కుందనపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను , వృక్ష సంపదను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, అర్బన్ ఫారెస్ట్ పార్కు సంబంధించిన గేట్ ఆర్చ్, వాకింగ్ ట్రాక్ పనులను పూర్తిచేయాలని అన్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్ కు సందర్శకులు అధికంగా వచ్చే విధంగా ఏ పనులు చేపట్టాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, అర్బన్ ఫారెస్ట్ పార్కును పర్యాటకులకు ఆకర్షణీయంగా తయారు చేయాలని
అన్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో మరింత గ్రీనరీ పెంచే విధంగా మొక్కలను నాటికి సంరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అటవీ అధికారి శివయ్య, ఫారెస్ట్ రేంజ్ అధికారి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
