
ఉత్తర్వులు అందజేసిన రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి
Trinethram News : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చౌదరిగుడా మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు పిట్ట రజిత వెంకటయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు జ్యోతి చేతుల మీదుగా ఎంపిక ఉత్తర్వులను అందజేశారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతారావు ఆదేశాల మేరకు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా పిట్ట రజిత వెంకటయ్య బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పిట్ట రజిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి తన వంతు సహకారం అందిస్తానని మహిళా విభాగాన్ని పూర్తిస్థాయిలో పటిష్టపరుచుతానని రజిత వెంకటయ్య తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మండల పార్టీ అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు, తదితర మహిళా కార్యకర్తలకు పార్టీ కార్యకర్తలకు తదితరులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. శక్తి వంచన లేకుండా మహిళా విభాగం అభ్యున్నతికి పాటుపడతానని పిట్ట రజిత తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
