
వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.
వికారాబాద్ మండలం ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి శ్రీనివాస్ మాదిగ వికారాబాద్ మండలంలోని పిరంపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూమిలోకి కలుపుకున్న రియల్ ఎస్టేట్ దళారులు, పిరంపల్లి గ్రామంలో ప్రభుత్వం కబ్జా చేసిన భూమిపైనే వికారాబాద్ జిల్లా కలెక్టర్ కి బుధవారం ఫిర్యాదు చేయడం జరిగింది, గ్రామంలో ఆర్ఎంబి రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని రాఘవేందర్ రెడ్డి, సంతోష్ పట్ట భూముల్లోకి కలుపుకున్నరు.
సిద్ధులుర్ గ్రామానికి చెందిన సోలి రాఘవేందర్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి , గడ్డల సంతోష్ తండ్రి పరమేష్ వీరిద్దరూ కలిసి పిరంపల్లి ప్రభుత్వ భూమి కబ్జా చేసి తన పట్ట భూమిలోనికి కలుపుకోవడం జరిగింది దీనిపై స్పందించిన గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేసి ప్రభుత్వ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వర్షాకాలంలో వాటర్ వచ్చే కాలువను కబ్జా చేయడం జరిగింది, రాత్రికి రాత్రి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంత గతంలో ఆ కాలువలో వర్షం పడితే గ్రామస్తులు కొట్టుకొని పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది , ఈ విషయమై వికారాబాద్ ఎమ్మార్వో కి ఫిర్యాదు చేయగా ఆర్ ఐ ని పంపించి సర్వే చేయించగా ఆక్రమణకు గురైనట్లు తేల్చడం జరిగిందని అధికారులు తెలుపడం జరిగింది. ఇట్టి భూమిని ఆక్రమించుకున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని మరోసారి ఇటువంటి సంఘటనలకు పాల్పడకుండా ఇది ఒక గుణపాఠం లాగా ఉండేవిధంగా ప్రభుత్వ ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కె. రవీందర్, ఏ రాజేందర్ రెడ్డి, బి, భాస్కర్ రెడ్డి, సునీల్ కుమార్, పి, మధు, తదిరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
