ఆగస్ట్ 17, 2026
TRINETHRAM NEWS
Pinninti Apparao Wins

Pinninti Apparao Wins : అరకులోయ,ఆగస్టు 18,( త్రినేత్రంన్యూస్): ఉత్తరాంధ్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం అనకాపల్లిలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీలకు ఉత్తరాంధ్రలోని సుమారు ఆరు జిల్లాల నుంచి పలువురు బాడీ బిల్డర్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
పోటీలను మొత్తం ఏడు విభాగాలుగా నిర్వహించారు. ఇందులో జనరల్, మాస్టర్స్, మెన్స్ ఫిజిక్ విభాగాలను వివిధ కేటగిరీలుగా విభజించి పోటీలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువ్యాలీ మండలం అరకు వ్యాలీకి చెందిన పిన్నింటి అప్పారావు (స్టిక్కరింగ్ షాప్) మాస్టర్స్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి సత్తా చాటారు. అలాగే జనరల్ విభాగంలోని 70 కేజీల కేటగిరీలో తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని శారీరక దృఢత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని వ్యక్తపరిచారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందిస్తాయని తెలిపారు.
ఉత్తరాంధ్ర స్థాయి పోటీల్లో రెండు విభాగాల్లో బహుమతులు సాధించిన అప్పారావును పలువురు అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page