“అర్హులైన అందరికీ పించను -ఎరిక్సన్ బాబు”
ప్రకాశం జిల్లా ,త్రినేత్రం న్యూస్, త్రిపురాంతకం.. త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామంలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ ని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి ఎరిక్సన్ బాబు గారు అందజేశారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు తన చేతుల మీదుగా మొదటగా పింఛను పంపిణీ చేశారు. త్వరలోనే అర్హులైన మరి కొంతమందికి పించను అందజేస్తామని, అనర్హులైన వారిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు ,అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App