
Trinethram News : శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ (SLBC) ఘటనపై తెలంగాణాలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ పిల్ దాఖలు చేసింది.
ఘటన జరిగి 10 రోజులైనా కార్మికుల ఆచూకీ లభించలేదని నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. టన్నెల్ సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయని… 24 గంటలూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని ఏజీ తెలిపారు.
సహాయక చర్యలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని చెప్పారు. ఏజీ తెలిపిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు(High Court).. పిల్‌పై విచారణను ముగించింది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో 14 కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీమ్ వెళ్తోంది. అయితే, రెస్క్యూ టీమ్‌కు బురద, పూడిక సవాలుగా మారాయి. సహాయక చర్యల్లో భాగంగా టీబీఎంను ముక్కలుగా కత్తిరించే ప్రక్రియ కొనసాగుతోంది.
మెరైన్ కమాండోలు, బీఆర్వో, ఆర్మీ, ఎన్‌హెచ్‌ఏ, రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్జీఆర్‌ఐ, జీఎస్‌ఐ, సింగరేణి వంటి 11 సంస్థలకు చెందిన బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
