TRINETHRAM NEWS

జియో సెల్ టవర్ నిర్మాణం నిలుపుదల చేయాలని కోరుతూ మున్సిపల్ కమీషనర్ కు వినతి.

చిలకలూరిపేట:పట్టణ ములోని 32 వ వార్డు భవనారుఋషి నగర్, ఏ.యం.జి దగ్గర సుగాలికాలనీ నివాస ప్రాంతంలోని గల దుర్గమ్మ దేవాలయం ప్రక్కన నివసించుచున్న జల్లెడ రామ్మెహనరావు ఇంటి పైన జియో సెల్ టవర్ నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారు. దీని నిలుపుదల చేయాలని కోరుతూ మంగళవారం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గతంలో వార్డు ప్రజలు, పలు సంఘాల నాయకులు అడ్డుకోవడం జరిగిందని, అధికారులు ఈ విషయంపై స్పందించటముతో సెల్ టవర్ నిర్మాణం నిలుపుదల చేశారని ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు. మరలా రెండు రోజుల నుంచి అర్ధరాత్రి పనులు చేస్తున్నారని ,దీని వలన ప్రజల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తక్షణమే సెల్ టవర్ నిర్మాణం నిలుపుదల చేయాలన్నారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం సెల్ టవర్ నిర్మాణం జరుగుతుందని, నిలుపుదల చేయకపోతే వార్డు ప్రజలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్, చేనేత విభాగం పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ అవ్వారు అన్నపు శెట్టి, బిట్ర నాగాంజనేయులు,బి. శ్రీను నాయక్, తోకల ప్రభుదాసు,బి. చిన్న నాయక్, ఎన్ దుర్గా నాయక్, ఆర్ మోహన్ నాయక్,బి. రాంబాబు నాయక్ ఎన్ శివ నాయక్,తో పాటు పలువురు వార్డు ప్రజలు పాల్గొన్నారు.