TRINETHRAM NEWS

సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పిల్లల డాక్టర్ను వెంటనే నియమించాలి

Trinethram News : ఈ రోజున తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంటీబీజీక్స్ ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ గోదావరిఖనిలో సింగరేణి ఏరియా కొత్తగూడెం తర్వాత ప్రధాన ఆసుపత్రిగా కొనసాగుతున్న ఏరియా గోదావరిఖని హాస్పిటల్లో పీడియాట్రిక్( పిల్లల వైద్యులు) లేనందున సింగరేణి ఉద్యోగుల పిల్లల అనారోగ్య సమస్యలపై నిత్యం వందలాదిమంది చికిత్స కోసం వస్తున్నారు, ఈ పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఇద్దరు పిల్లల వైద్యులు 24 గంటలు వైద్య సేవలు అందించాల్సి ఉండగా ఏరియా హాస్పిటల్ నందు ఒక్కరు కూడా అందుబాటు లేకుండా ఉన్నారు. రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ నుండి పిల్లల వైద్యులు మూడు రోజులు ఈ ఏరియా హాస్పిటల్ వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు.

దీనితో చిన్నపిల్లలకి ఏ సమస్య వచ్చినా ప్రైవేటు ఆసుపత్రి వెళ్లాల్సి వస్తుందందున తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది దీనికి తోడు చిన్న పిల్లలకు సంబంధించిన ప్రత్యేక వార్డు కూడా అందుబాటులో లేకుండా సమస్యలు ఎదురవుతున్నాయి వేలాది రూపాయలు ప్రైవేటు ఆసుపత్రులకు విచించడం వల్ల యువ కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారు కావున సింగరేణి ఏరియా గోదావరిఖనిలో ఇద్దరు పిల్లల డాక్టర్ వెంటనే నియమించాలని పిల్లలకు ప్రత్యేక వాడ ఏర్పాటు చేయాలని బొగ్గుగని కార్మిక సంఘం.టీబీజీక్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో టీబీజీకే తరఫున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం

అదేవిధంగా సింగరేణి ఏరియా హాస్పిటల్ నందు అనేక సింగరేణి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అదేవిధంగా రోగులకు సంబంధించిన సమస్యలపై అక్కడ ఉన్న సమస్యలపై విన్నవించేందుకు టీబీజీకేస్ ప్రతినిధిగా ఫిట్ సెక్రటరీగా ఎండి అప్సర్ పాషను నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మాధస్ రామ్మూర్తి చెల్పూరి సతీష్ దూట శేషగిరి . కొండ అంజయ్య సిహెచ్ శ్రీనివాస్ జనగామ మల్లేష్ . వాసర్ల జోసెఫ్ . బొగ్గుల సాయి కృష్ణ. పుప్పాల రవీందర్. మహేందర్ రెడ్డి. మురళి. టీబీజీకే ఎస్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Petition by ACM Kiran Raju