TRINETHRAM NEWS

Trinethram News : AP: సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్లతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీలకు లేఖ రాశారు. ప్రచార సామగ్రి అనుమతులు సీఈవో వద్ద, ఊరేగింపులు, ర్యాలీలకు జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.