TRINETHRAM NEWS

వివరాలను వెల్లడించిన యర్రగుంట్ల సీఐ నరేష్ బాబు….

యర్రగుంట్ల వేంపల్లి రోడ్డు లో గల ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం లో చోరీకి యత్నించిన వ్యక్తులను యర్రగుంట్ల పోలీసులు అరెస్టు చేశారు.

Trinethram News : కడప జిల్లా : ఈనెల 17 తేదీ ఏటీఎం మిషన్ గ్యాస్ కట్టర్ సహాయంతో కట్ చేసి అందులోని నగదుని కాజేయాలని ప్రయత్నించి ఏటీఎం మిషన్ డోర్ ఓపెన్ కాకపోవడంతో నిందితులు వెనుదిరిగినట్లు తెలిపిన సీఐ.

నిందితులు ప్రొద్దుటూరు సమీపంలోని రాజుపాలెం కు చెందిన కొత్త మాసి సుధికర్ (29), గాలిపోతుల అభిషేక్ (24) గా గుర్తింపు.

చెడు వ్యసనాలకు బానిసలైన నిందితులు ఈ దోపిడీకి యత్నించినట్టు తెలిపిన పోలీసులు.

నిందితుడు సుధికర్ గతంలో ఏటీఎం మిషన్ల నందు డబ్బులు డిపాజిట్ చేసే ఉద్యోగం చేసేవాడని అక్కడ దొంగతనాలకు పాల్పడుతూ ఉండడంతో ఆ సంస్థ అతనిని తొలగించిందని తెలిపిన పోలీసులు.

మూడు నెలల క్రితం నుండి యర్రగుంట్ల ఐసిఐసిఐ బ్యాంకు కు చెందిన ఏటీఎం మిషన్ పనిచేయడం లేదని అందులో నగదు ఉన్న విషయాన్ని తెలుసుకుని ఈ చోరీకి యత్నించినట్టు పోలీసులు తెలిపారు.

నిందితుల వద్ద నుండి ఒక కారు, గ్యాస్ కట్టర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.

నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

People who tried to