TRINETHRAM NEWS

యువ నేత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి శుభాకాంక్షలు తెలిపిన కుత్బుల్లాపూర్ ప్రజానీకం….

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద యువనేత కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు నన్ను తమ ప్రతినిధిగా భావించి దీవిస్తూ ఇంతటి అఖండ విజయాన్ని అందించినందుకు సదా కృతజ్ఞుడనని అన్నారు. మీరందించిన ఇంతటి విజయంతో నాపై బాధ్యత మరింత పెరిగిందని అందరి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.