TRINETHRAM NEWS

People in low lying areas should be alert

పలు కాలనీలో పర్యటించిన మేయర్ అజయ్ యాదవ్

అకాల వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావోద్దని బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రజలను కోరారు.సోమవారం రాత్రి,మంగళవారం నాడు తెల్లవారు జామున కురిసిన ఆకాల వర్షం కారణంగా నీట మునిగిన కాలనీలో కమీషనర్ రామలింగం,
కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి పర్యటించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ ఆకాల వర్ణాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావోద్దని సూచించారు. 3 వ డివిజన్ వెంకటసాయి,ఎంఎల్ఆర్
కాలనీ,ఎస్బీఅర్ కాలనీ,అమ్మసాని వెంకట్ రెడ్డి కాలనీ,అంజయ్య ఎన్క్లేవ్,లక్ష్మారెడ్డి కాలనీ,
ల్లో స్థానిక కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్,కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, కొత్త దుర్గమ్మ, చీరాల నరసింహ లతో మేయర్ కాలనీలో పర్యటించి నిలిచిన వర్షం నీరు దిగువకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాలు ఉన్న కారణంగా మానుసూన్ ను టీం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త కిషోర్ గౌడ్, పులకండ్ల జంగారెడ్డి, కొత్త విక్రం గౌడ్,పోగుల దిలీప్ రెడ్డి
వెంకటసాయి నగర్ అసోసియేషన్ నాయకులు రాజిరెడ్డి,కార్పొరేషన్ డీఈఈలు,ఏఈఈలు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

People in low lying areas should be alert