TRINETHRAM NEWS

Pending land acquisition issue should be resolved within a month

రాబోయే వానాకాలం నాటికి పెద్దపల్లి కునారం ఆర్.ఓ.బీ సిద్దం జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*నెల రోజుల్లో పెండింగ్ భూ సేకరణ సమస్య పరిష్కరించాలి

పెద్దపల్లి కూనారం ఆర్.ఓ.బీ పనులు పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ కోయ హర్ష

పెద్దపల్లి, ఆగస్టు-16: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రాబోయే వానాకాలం నాటికి పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తిచేసే ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష
స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావుతో కలిసి పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, 119 కోట్ల 50 లక్షల వ్యయంతో పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రభుత్వం నిర్మిస్తుందని, శ్రీరాంపూర్ వైపుగా 28 స్లాబ్ లు, 150 మీటర్ల అప్రోచ్, పెద్దపల్లి వైపుగా 18 స్లాబ్ లు, 145 మీటర్ల అప్రోచ్ తో పనులు జరుగుతున్నాయని తెలిపారు.

పెద్దపల్లి కూనారం ఆర్.ఓ.బీ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన పెండింగ్ భూ సేకరణ ప్రక్రియ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని, వచ్చే వానాకాలం నాటికి నాణ్యతతో కూడిన ఆర్.ఓ.బీ పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రావాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, పెద్దపల్లి తహసిల్దార్ ,ఈ ఆర్ &బీ భావ్ సింగ్, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pending land acquisition issue should be resolved within a month