క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ కాలువ కట్ట సమీపంలోని న్యూ బిలివర్ చర్చ్, కల్వరి ప్రత్యేక్ష ప్రార్థన మందిరంలో, కల్వరెంట్ , సి.ఎస్. ఐ చర్చి, క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పలు చర్చులల్లో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలల్లో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
అనంతరం పలు చర్చుల ఫాదర్స్ ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ
క్రిస్మస్ ఒక ప్రాంత పండుగనే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్ పండుగ అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసు క్రీస్తు బోధనలు విశ్వమానవాళికి మార్గదర్శకం అన్నారు.శాంతి సహనం కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బోధించిన జీసస్ మాటలు సదా అనుసరించాల్సిన మార్గం అన్నారు మరియు కరుణామయుడు జీసస్ పుట్టినరోజున మీ జీవితంలో ఆనందాలు నిండాలని, శాంతి, సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నారు అలాగే ఏసుక్రీస్తు నేర్పిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం సర్వమత హితంగా పరిపాలన చేస్తుంది. అన్ని మతాల ప్రజల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం స్థిర సంకల్పంతో కట్టుబడి పని చేస్తుందన్నారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిచే విధంగా కృషి చేయాలన్న ఎమ్మెల్యే విజయరమణ రావు
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప మరియు పట్టణ కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, మస్రధ్, భూతగడ్డ సంపత్, తూముల సుభాష్, ఎరుకల కల్పన రమేష్, శ్రీమాన్, , బొడ్డుపల్లి శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు క్రైస్తవ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App