Peddapally MLA Vijaya Ramana Rao press meet points in press and media conference
హైదరబాద్ లో అసెంబ్లీ లో CLP కార్యాలయం లో
పత్రిక మరియు మీడియా సమావేశం లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రెస్‌మీట్ పాయింట్స్
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మాజీ మంత్రి గంగుల కమలాకర్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.
కాళేశ్వరం కట్టింది, కూలింది కూడా వాళ్ల హాయాంలోనే.
కేటీఆర్ కాళేశ్వరం పోయి సెల్ఫీలు దిగి ఫోటోలకు ఫోజులిచ్చి వచ్చాడు.
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు నిలువ చేయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్పిన విషయం బీఆర్‌ఎస్ నేతలకు తెలియదా?
లక్ష కోట్లు అడ్డంగా దోచి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలిపోయింది.
కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లిలాంటి ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు.
ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దోచిన బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.
బావ, బామ్మర్ది ఢల్లీిలో బీజేపీ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.
శ్రీరాంసాగర్‌లో ఇప్పటికే 40టీఎంసీలు నీళ్లు వచ్చాయి. మరో 35టీఎంసీల నీళ్లు వస్తే దిగువననున్న అన్ని ప్రాజెక్టులు నిండుతాయి.
మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల మరో 2, 3రోజుల్లో గోదావరికి పెద్ద ఎత్తున వరద రాబోతుంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వారం, పదిరోజుల్లో పూర్తిగా నిండుతుంది.
గతంలో కన్నెపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్లను మళ్లీ సముద్రంలోకి వదిలారు. ఇంజనీర్ల సూచనల మేరకే మా ప్రభుత్వం నడుస్తుంది.
ఉమ్మడి కరీంనగర్‌కు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు.
మల్లన్నసాగర్ కోసం మామ, అల్లుడు కరీంనగర్ పొట్టకొట్టారు.
- మూడేళ్లలో కాళేశ్వరం నుంచి 90టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి.. మళ్లీ 40టీఎంసీలు సముద్రంలోకి వదిలారు.
కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాల ఆయకట్టు కూడా రాలేదు.
పదేళ్ల పాటు రైతులను నమ్మించి మోసం చేశారు. గంగుల కమలాకర్ లాంటి వాళ్లు చౌకబారు మాటలు బంద్ చేయాలి.
రుణమాఫీపైన బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
పదేళ్ల కాలంలో ఎగ్గొట్టిన రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్ భవన్‌లో హెల్ప్‌లైన్లు పెట్టాలి.
వడ్డీతో సహా ఇప్పుడు రైతులకు రుణమాఫీ జరుగుతోంది.
కాంగ్రెస్ హయాంలో మాత్రమే సంపూర్ణ రుణమాఫీ జరిగింది.
రుణమాఫీ ఒక చరిత్ర.
రుణమాఫీ వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు.
బీఆర్‌ఎస్ పుట్టిందే అబద్ధాల పైన.
వ్యవసాయం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.72వేల కోట్లను కేటాయించాం.
రైతుభరోసాతో పాటు పంటల బీమా కూడా అమలు చేస్తాం.
సన్న వడ్లకు రూ.500బోనస్ ఇస్తాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App