Peddapalli MLA Vijayaramana Rao met Peddapalli agricultural market with courtesy
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఇటీవల నూతనంగా నియమితులైన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ శ్రీమతి. ఈర్ల స్వరూప వైస్ చైర్మన్ కూర మల్లా రెడ్డి మరియు నూతన డైరెక్టర్లు మంగళవారం రోజున ఉదయం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి తమ పై నమ్మకంతో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గంలోకి నియమించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు నూతన చైర్మన్ ఈర్ల స్వరూప వైస్ చైర్మన్ కూర మల్లా రెడ్డి పాలకవర్గానికి తమ నియామక పత్రాలను అందజేసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రైతు సంక్షేమానికి కృషి చేయాలని పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నూతన డైరెక్టర్లు ఆల్ల సుమన్ రెడ్డి (పోత్కపల్లి ప్యాక్స్ చైర్మన్), కొమ్ము కరుణాకర్, సోమ చంద్రయ్య, మడగోని శ్రీనివాస్, కొలిపాక కనకయ్య, వేగోలపు పెద్ద రాజేశం, పిట్టల కొమురయ్య, ఎం.డి గౌస్ మియ, గోపతి సదానందం, కొల్లూరి రామచంద్రం, తిప్పరపు ప్రభాకర్, సరోత్తం రెడ్డి, ఎడ్ల మహేందర్, ప్రజాప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.