
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా, పాడేరు లో ఆదివారం సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పై, చింతిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తూ, పాడేరు మండలం పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు, శాంతి ర్యాలీ నిర్వహిస్తూ పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చెయ్యాలని,పాస్టర్ లకు క్రైస్థవులకు, క్రైస్తవ మందిరాలుకు భద్రత కల్పించాలని, పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్, యునైటెడ్ క్రిస్టియన్ యూత్, ఆదివాసీ ప్రభావిత పదం క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
