TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల అనుమానాస్పద మృతి పట్ల న్యాయం చేయాలని కోరుతూ ఇంటర్‌-డినామినేషనల్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ (ఐపిఎఫ్‌) పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో సంఫీుభావ, శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక లేబర్‌ కోర్టు నుండి ప్రారంభమై వికె రెడ్డి, రీగల్‌ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు కొనసాగింది. క్రైస్తవ నాయకులు, పాస్టర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తులు వెలిగించి తమ సంఫీుభావాన్ని ప్రకటించారు. అనంతరం దేశవ్యాప్తంగా అన్ని మతాల వారు ఐక్యతగా ఉండాలని, వారి భద్రత, క్షేమం కోసం ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు, పాస్టర్లు, విశ్వాసులు పాల్గొని క్రైస్తవుల ఐక్యతను చాటిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, రాజమండ్రి ప్రాంతంలో పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఐపిఎఫ్‌ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పాస్టర్‌ ఎం.మహిపాల్‌ రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ పాస్టర్‌ బి.రవి పాల్‌, ప్రధాన కార్యదర్శి పాస్టర్‌ పి.డిలైట్‌, ట్రెజరర్‌ పాస్టర్‌ కె.సొలోమన్‌ రాజు, జాయింట్‌ ట్రెజరర్‌ పాస్టర్‌ డి.గాబ్రియేల్‌, సిఎస్‌ఐ పాస్టర్‌ రెవ లక్మణ్‌ జాకబ్‌, ఐపిఎఫ్‌ పాస్టర్లు పాస్టర్‌ ప్రకాష్‌, థామస్‌, ఇతర పాస్టర్లు, జిమ్మి బాబు, దయానంద్‌ గాంధీ, విలాసాగరపు శ్రీనివాస్‌ తదితరులున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Peace and harmony rally