గోదావరిఖని నడిబొడ్డిలో పిడిఎఫ్ రైస్ అక్రమ రవాణా..
రేషన్ బియ్యం అక్రమ దందాలు అరికట్టే యజమానులు ఏం చేస్తున్నట్టు అంటూ పలువురి ఆందోళన
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి డిసెంబర్,5 రామగుండం:
రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటూ ప్రభుత్వాన్ని తప్పుదోవన పట్టిస్తూ, ఇదేంటని అడిగితే తాను రేషన్ డీలర్లందరికి అధ్యక్షున్ననీ, తప్పును కప్పి పుచ్చుకోవడానికి అందరు అమ్ముకున్నట్లే తాను కూడా అంటూ యదేచ్చగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం గమనార్హం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్థానిక గాంధీనగర్ లో గల రేషన్ షాప్ నెంబర్ 09 యజమాని డిసెంబర్ 3న రాత్రి ఒక ఆటోలో రేషన్ బియ్యాన్ని లోడు చేసి తరలిస్తుండగా మీడియా కెమెరాకు చిక్కడం జరిగింది. తన బ్యాక్ గ్రౌండ్ పెద్దదని, కెమెరాను లాక్కుని దౌర్జన్యం చేయబోయాడు. తాను తప్పు చేస్తూ, ఇది అందరు రేషన్ యజమానులు చేసేదే తాను చేస్తున్నానని, ఇదంతా సర్వసాధారణం అనడం… చూస్తుంటే ఈ అక్రమ దందాకి ఏదో పెద్ద సపోర్ట్ ఉందని పలువురు వాపోతున్నారు. ప్రజలకు చెందాల్సిన పిడిఎఫ్ బియ్యాన్ని అక్రమ దందని, అక్రమ రవాణాని ఆపే అధికారులు ఏం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా దీన్ని అరికట్టాలని అధికారులకు పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App