
సిఐటియు వి. ఉమామహేశ్వరరావు డిమాండ్.
అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 30:
మాత్మ గాంధీ గ్రామీణ ఉపాదామి పథకం పనిచేస్తున్న కూలీలకు గత ఐదు వారాలుగ డబ్బులు చెల్లించలేదని తక్షణం చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ మేరకు శనివారం అరకు వ్యాలీ పెదలబుడు పంచాయితీ నువ్వు గూడ గ్రామంలో కూలీలతో కలిసి పని చేస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాదామే బడ్జెట్లో నిధులు తగ్గించిందని తెలిపారు.
గతంలో కూలీలకు పనిముట్లు ఇచ్చేవారని అదేవిధంగా టెంట్లు, మంచినీళ్లు వంటి సౌకర్యం కల్పించే వారిని తెలిపారు ఇప్పుడు పూర్తిగా అటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని దీని దృష్టిలో పెట్టుకొని ఉపాదామి పథకంలో 200 రోజులు కల్పిస్తూ రోజు కూలి 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కూలీలతో కలిసి సమస్యలు పరిష్కారం కి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ప్రభాకర్, మధు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
