TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలను ఈసారి వాట్సాప్‌ ద్వార విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో ఫలితాలు విడుదల చేస్తే ఇంటర్‌నెట్‌ సెంటర్‌కు వెళ్లడమో, సెల్‌ఫోన్‌లోనో చూసుకునే వాళ్లు. ఇకపై ఈ ఇబ్బంది లేకుండా నేరుగా ఫలితాలు విద్యార్థి తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్‌లకే పంపించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంటర్ పరీక్షలు ఈ మధ్య ముగిశాయి. మూల్యాంకనమం కూడా వేగంగా సాగుతోంది. మార్చి 17తో పరీక్షలలు పూర్తి అయ్యాయి. మార్చి 19 నుంచి మూల్యాంకనం ప్రారంభమైంది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు. ఇది ఏప్రిల్‌ 10 నాటికి పూర్తి కానుంది. మిగతా ప్రక్రియను పూర్తి చేసి ఏప్రిల్‌ మూడో వారంలో ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు అధికారులు.

ఇప్పుడు ఈ ఫలితాలను రెండు విధాలుగా చూసుకోవచ్చు. ఫలితాలు విడదలైన తర్వాత సంప్రదాయపద్ధతిలో నెట్‌లో నెంబర్‌ టైప్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. అయితే అంత కంటే ముందే తల్లిదండ్రులు, విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నెంబర్ వాట్సాప్‌కు ఫలితాలు పంపిస్తారు.

ఫలితాలు వచ్చిన పది నుంచి 20 నిమిషాల్లోనే ఫలితాలు విద్యార్థి ఇచ్చిన నెంబర్‌కు పంపించనున్నారు. ఫస్ట్ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు ఈ మార్కులు పంపిస్తారు. రెండో సంవత్సరం చదువుతున్న వాళ్లకు రెండేళ్లకు సంబంధించిన మార్క్స్‌షీట్స్ పంపిస్తారు. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్‌ తీసుకొని వాడుకోవచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Parents WhatsApp only AP