TRINETHRAM NEWS

Ramagundam MLA Raj Thakur asked the Panchayat Raj secretaries of Palakurti Antargam mandal to identify every problem in every village and bring it to my notice

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా చూడాలి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
అంతర్గాం మరియు పాలకుర్తి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో మంచినీటి మరియు విధి దీపాలు మురికి కాల్వల సమస్యలు తెలుసుకోండి ప్రతి ఒకరు గ్రామ సమస్య తమ సమస్యకు గుర్తించి పరిష్కరించాలని కోరిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ
ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవానికి అందేలా చూడాలి.
రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పేదవారికి అందేలా చూడాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఆదివారం రామగుండం ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో రామగుండం అంతర్గాం పాలకుర్తి మండలాల గ్రామ కార్యదర్శులచే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్గాం పాలకుర్తి మండలాల పాఠశాలల అభివృద్ధి కోసం రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు.

ప్రతి గ్రామంలో ప్రతి సమస్యను గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని కార్యదర్శులను కోరారు. ప్రతి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటాలని గ్రామాల పరిశుభ్రత క్లోరినేషన్ మురికి కాలువల పరిశుభ్రత ఎప్పటికప్పుడు చూస్తూ చేయాలని అన్నారు. అలాగే పాలకుర్తి అంతర్గాం లోని 35 గ్రామాల్లో ప్రతి సమస్యను రాతపూర్వకంగా తీసుకువచ్చి ఆయా గ్రామ కార్యదర్శులు క్యాంపు కార్యాలయంలో అందజేయాలని అన్నారు. యువత కోసం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి చేస్తామని అన్నారు.

అలాగే సింగరేణి సంస్థ సహకారంతో సోలార్ దీపాలు గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరేలా కార్యదర్శి చూడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి ప్రతి ఒక్కరూ గ్రామ సమస్య తమ సమస్యగా గుర్తించి పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శిలతో పాటు అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాలకుర్తి మరియు అంతర్గం మండలం సంబంధించిన పంచాయతీరాజ్ కార్యదర్శులు కలవడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam MLA Raj Thakur asked the Panchayat Raj secretaries of Palakurti Antargam mandal to identify every problem in every village and bring it to my notice