
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, పాడేరు మండలం, సుండ్రపుట్టు గ్రామంలో ఘనంగా శ్రీరాముల వారి కళ్యాణ మండపం ప్రారంభించిన వంపూరు గంగులయ్య మరియు కూటమి నాయకులు
గిరిజన ప్రాంతంలో అతి పురాతనమైన రామలయంగా ప్రసిద్ధి చెందిన సుండ్రుపుట్టు గ్రామ రామాలయం భక్తులు,స్థానిక గ్రామస్తులు ఈ నవమి ఉత్సవాల కంటే ముందుగా నూతనంగా శ్రీ రాములవారి కళ్యాణ మండపం నిర్మాణం చేసుకున్నారు.ఈ కల్యాణ మండపం ప్రారంభోత్సవానికి అతిథిగా జనసేన పార్టీ అరకు పార్లమెంట్ మరియు పాడేరు నియోజకవర్గం ఇంచార్జీ గంగులయ్య గారిని ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్భంగా గంగులయ్య మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న సుండ్రుపుట్టు రామాలయం నేడు ఉత్సవాల నిర్వహణకు, కల్యాణ శుభ కార్యాలకు ఒక చక్కటి వేదికగా ఈ కళ్యాణ మండపం గ్రామస్తులు,భక్తులు సమైక్యతతో నిర్మించుకోవడం వారిలో ఆధ్యాత్మిక చింతనకు తార్కాణంగా భావించవచ్చు.
బావి తరాలు ఇటువంటి గొప్ప కార్యక్రమాల విశిష్టత పెద్దల ధర్మబద్ధమైన ఆలోచనలను గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మిక చింతనతో పాపభీతి తో జీవనం నేటి యువత అలవరుచుకోవాలన్నారు.అనంతరం నూతన కల్యాణ మండపం రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాడేరు నియోజకవర్గ తెదేపా ఇంచార్జీ గిడ్డి ఈశ్వరి,తెదేపా నాయకులు కొట్టగుల్లి సుబ్బారావు,శివాలయం ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలం నాయుడు,శ్రీ మోద మాంబ అమ్మవారి ఆలయ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు,గ్రామ పెద్ద పలసి సురేష్,గ్రామ పీసా కమిటి అధ్యక్షులు,తదితర నాయకులు,భక్తులు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
