
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( చింతపల్లి ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, చింతపల్లి మండలం, అంజలి శనివారం పంచాయితీ లో వెలసిన శ్రీ .శ్రీ .శ్రీ బోడ కొండమ్మ , గంగాలమ్మ , ఎర్ర కొండమ్మ అమ్మ వార్ల జాతర మహోత్సవాలు సందర్భంగా, గ్రామస్తులు ఆహ్వానం మేరకు పాడేరు శాసన సభ్యులు,వైసీపీ అల్లూరి జిల్లా అధ్యక్షులు,.మత్స్య రాస విశ్వేశ్వర రాజు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు,మహిళలు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో కొలువు తీరిన అమ్మవార్లను ప్రత్యేక పూజలో పాల్గొని దర్శించుకున్నారు.
ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే దేవుని భక్తితో గ్రామస్తులకు నగదు విరాళంగా అందజేశారు. •సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన చుట్టాలు, బంధువులు మరియు భక్తులతో అందరికీ శాసన సభ్యులు ఆప్యాయంగా పలకరించి, యువకులతో క్రీడలు ఆడుతూ అందరితో సరదాగా ఉత్సవాలను తిలకిస్తూ అందరిని ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సాగేని వెంగళరావు, స్థానిక సర్పంచ్ పేట్ల రాజబాబు, ex.mptc.లోచలి భవాని, కిముడు లక్ష్మణరావు, కిముడు.చిన్న లక్ష్మణరావు, సాగేని సింహాచలం, లకే. గణపతి రావు,ల కే కళ్యాణం,లకే అశోక్ కుమార్ కిముడు రామకృష్ణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
