
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పీ4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అంశాలపై నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది ఆగస్టు నాటికి 5 లక్షల అభిలాషి కుటుంబాలను ‘సమృద్ధి బంధనమ్’ కింద తీసుకువచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొదటగా రాష్ట్రంలోని 4 గ్రామాల్లో పీ4 విధానాన్ని పైలెట్ ప్రాజెక్టు గా అధికారులు రూపొందించారు. ఈ పైలెట్ ప్రాజెక్టుతో 5,869 కుటుంబాలకు లబ్ది పొందుతాయి.
ఈ కార్యక్రమంలో నిజంగా పేదరికంలో ఉన్నవారికి సాయం అందచేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలు పీ4కు అర్హులుగా ప్రాథమికంగా నిర్ధారించారు. సమీక్షా కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్, ఇతర ఉన్నాధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
