TRINETHRAM NEWS

సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేయలేదు
తేదీ : 04/02/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టిడిపి మంత్రి సవిత కడప జిల్లాలో పర్యటించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ , గత ప్రభుత్వం వైసీపీ హాయంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని సవిత అగ్రహం వ్యక్తపరిచారు.

జగన్ తీరుతో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని మంత్రి ధ్వజమెత్తారు. తన సొంత జిల్లాని కూడా అభివృద్ధి చేయలేని వ్యక్తి ఎక్కడ ఉండర ని .మండిపడ్డారు. అన్ని సమస్యల్లో నీటి సమస్య ఎక్కువగా ఉందని దానిపై సమీక్ష నిర్వహించి పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Savitha