TRINETHRAM NEWS

పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే మా లక్ష్యం..

వాకర్స్ సమస్యలను పరిష్కరిస్తాం..

ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం రోజున ఉదయం వాకర్స్ తో కలిసి మార్నింగ్ వాకింగ్ చేసిన అనంతరం మైదానానికి సంబందించిన పలు సమస్యలను (వాకింగ్ ట్రక్) వాకార్స్ సభ్యులు వారి దృష్టికి తీసుకరాగ తొందరలోనే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని అలాగే అందరం కలిసి కట్టుగా ఉన్నప్పుడే పట్టణాన్ని అభివృద్ధి చేసుకోగలం అని పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించబోయే కళాశాల భవనాన్ని వాకర్స్ లకి ఇబ్బంది కలగకుండా ఉండకుండా చూసుకుంటామని అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

అనంతరం వాకర్స్ కు అనుగుణంగా మంచి వాకింగ్ ట్రాక్ కు నిర్మిస్తామని వాకర్స్ సభ్యులకు హామీ ఇచ్చారు.

తదనంతరం ఎమ్మెల్యే విజయరమణ రావు సరదాగ కళాశాల మైదానంలో క్రికెట్ మరియు బ్యాట్మింటన్ ఆడారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాకర్స్ మరియు వాకర్స్ అసోసియేషన్స్ సభ్యులు, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App