Trinethram News : తేది: 06-03-2024 తాడేపల్లి
వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.1300 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ :సీఎం జగన్
రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల టన్నుల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం..
ఈ 58 నెలల కాలంలో ఉచిత బీమా కింద రూ. 7,802 కోట్లను రైతులకు చెల్లించాం
నాలుగేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు.. ఇన్ పుట్ సబ్సిడీ విడుదల కార్యక్రమంలో సీఎం జగన్
మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఖరీఫ్ వర్షాభావం వల్ల, మిచాంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా రైతన్నలకు తోడుగా, అండగా ప్రభుత్వం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకేస్తున్నామన్నారు. రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇంత క్రమం తప్పకుండా, పారదర్శకంగా చేయాల్సిన మంచి రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేదు.
మొట్టమొదటి సారిగా పరిస్థితులు మార్చాం. గ్రామస్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ(పంట నష్టపరిహారం)ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ. 1,294.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్ బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు.
గతేడాది ఖరీఫ్ వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులకు, ఈ రబీ సీజన్‌లో మిచాంగ్ తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం భరోసాను కల్పిస్తూ అడుగులు వేస్తున్నాం. ఏపీలో ఈ మాదిరిగా ప్రభుత్వాలు రైతులకు ఏదైన నష్టం జరిగితే ఇంత పారదర్శకంగా చేసిన సందర్భాలు లేవు. ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితి గత ఐదేళ్లలోజరగలేదు. మొట్ట మొదటిసారిగా పరిస్థితులు మారాయి. గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ, ఆర్‌బీకే వ్యవస్థలు రావడంతో పరిస్థితులు మారాయి. పంట వేసిన వెంటనే ఈ–క్రాప్ నమోదు చేస్తున్నారు. పూర్తి డేటా అందుబాటులోకి రావడంతో వరదలు, మరో కారణం వల్ల ఏ పంట నష్టం జరిగినా అత్యంత పారదర్శకంగా జాబితాను రూపొందిస్తున్నాం. సచివాలయ పరిధిలో లిస్ట్ ఏర్పాటు చేసి రైతులు చూసుకునే వెసులుబాటు కూడా అందుబాటులో ఉంటుంది. ఇలాంటి గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోకి రావడం, ఎక్కడా కూడా వివక్ష లేకుండా పూర్తి పారదర్శకంగా పరిహారం అందజేస్తున్నాం. ప్రతి రైతుకు కూడా అందాల్సిన సాయం, అందాల్సిన సమయంలో అందిస్తున్నది కేవలం ఈ 57 నెలల పాలనలోనే జరుగుతుంది. నిజంగా ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని సంతోషంగా చెబుతున్నాను. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ రోజు ప్రభుత్వం నమ్మకం కలిగిస్తూ అడుగులు ముందుకు వేస్తోంది.
మిచాంగ్ తుపాన్‌లో పంట నష్టపోతే, రంగు మారిన ధాన్యం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఈ ప్రభుత్వంలో రైతు నష్టపోకూడదని మొట్ట మొదటిసారిగా అటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం. మిచాంగ్ తుపాన్‌లో రంగుమారిన, తడిసిన ధ్యానం 3 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. అన్ని రకాలుగా అందాల్సిన సాయాన్ని అందించాం.
గతేడాది ఖరీఫ్‌లో వర్షాభావం, రబీలో వచ్చిన మిచాంగ్ తుపాన్‌లో నష్టపోయిన 11.60 లక్షల మంది రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీగా రూ.12.90 కోట్లు ఈ రోజు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం.
ప్రతి అడుగులోనూ కూడా రైతులకు ఎప్పుడు సహాయం అందాలి. ఎప్పుడు తోడుగా ఉండాలని సమయానికి అందిస్తున్నాం. ఈ 58 నెలల కాలంలో 58.56 లక్షల మంది రైతులకు రూ.7800 కోట్లు ఇన్స్‌రెన్స్ సొమ్ము అందించాం. రైతుల నుంచి ప్రీమియం కట్టించుకోలేదు. గత ప్రభుత్వ పాలనతో పోల్చితే ఇన్సూరెన్స్ 30.08 లక్షల మందికి మాత్రమే అందించారు. ప్రతి ఏటా చంద్రబాబు పాలనలో కరువే. రూ.3411 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఇచ్చింది.
మన ప్రభుత్వం వచ్చిన తరువాత దేవుడి దయతో వర్షాలు సకాలంలో పడుతున్నాయి. కరువు మండలాలు ప్రకటించాల్సిన అవసరం రాలేదు. 54.50 లక్షల మందికి తోడుగా నిలిచాం. రైతులకు ఈ–క్రాప్ ద్వారా ఇన్సూరెన్స్ అందిస్తున్నాం. గతంలో రైతులు బ్యాంకు రుణాలు తీసుకున్న సమయంలోనే 5 శాతం ప్రీమియం తీసుకునేవారు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఎన్నో మార్పులు జరిగాయి.
ఇది కొత్త ఒరవడి అన్నది ఈ 58 నెలల పాలనలోనే జరిగింది. ప్రతి రైతుకు రూ.31500 ఇచ్చింది గతంలో ఎప్పుడూ లేదు. రైతులు సాగు చేసే సమయంలో ప్రభుత్వం అండగా నిలిచిన సందర్భాలు ఎప్పుడూ లేవు. 63 శాతం మంది రైతులకు 0.5 హెక్టార్ మాత్రమే భూములు ఉన్నాయి. ఈ రైతులకు క్రమం తప్పకుండా రైతు భరోసా సాయం క్రమం తప్పకుండా అందిస్తుండటంతో రైతులకు 80 శాతం పెట్టుబడిసాయంగా ఉపయోగపడుతోంది.
ఈ నాలుగేళ్లలో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. గతేడాది మాత్రం కొంత వర్షాభావ పరిస్థితుల్లో 7 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాం. ఈ ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు ఈ రోజు నష్టపరిహారం అందిస్తున్నాం. ఈ రోజు రూ.840 కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ అందిస్తున్నాం. మిచాంగ్ తుపాన్‌లో నష్టపోయిన 4.60 లక్షల మందికి ఇన్‌ఫుట్ సబ్సిడీ అందిస్తున్నాం. 11 లక్షల మంది రైతులకు రూ.1300 కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ అందిస్తున్నాం. రైతు ఎక్కడా కూడా నష్టపోకూడదు. ప్రత్యామ్నయ పంటల సాగు కోసం విత్తనాలు అందిస్తున్నాం. ఉలువలు, అలసందా, కందులు, రాగి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటల సాగు కోసం 30 వేల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశాం.
మిచాంగ్ తుపాన్‌లో నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాం. ఆర్‌బీకేల ద్వారా సరఫరా చేసి రైతులకు తోడుగా నిలిచాం. ఇది మీ ప్రభుత్వం ..మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. ఈ కార్యక్రమం వల్ల నష్టపోయిన రైతులకు ఊరట రావాలని ఆకాంక్షిస్తూ సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో ఇన్‌ఫుట్ సబ్సిడీ జమ చేశారు.