
తేదీ : 06/03/2025. కుక్కునూరు మండలం : (త్రినేత్రం న్యూస్) ; విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం పోలీస్ స్టేషన్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలకు ఓపెన్ గృహ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఎక్కడ ప్రమాదం ఏర్పడిన 100, 112 కు కాల్ చేస్తే వెంటనే సెక్యూరిటీ పొందవచ్చని వారికి వివరించారు. హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళ కానిస్టేబుల్ సునీత వివరించడం జరిగింది.
అదేవిధంగా కానిస్టేబుల్ రామకృష్ణ, దుర్గారావు పోలీస్ స్టేషన్ యొక్క విధి విధానాలు మరియు , రికార్డులు, లాకప్, రిసెప్షన్, కౌంటర్, వైర్లెస్ సెట్ ఎలా వాడాలో, అన్ని గదులలో ఉన్న రికార్డుల యొక్క ప్రాముఖ్యత, లాకప్ ని ఏ సమయంలో ఉపయోగిస్తామో అనేది వారికి స్పష్టంగా సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
