TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అధ్వర్యంలో మాతృమూర్తిని కొలిపోయి నిరాశ్రయులైన పిల్లలకు ఆర్థిక

ఒకటవ డివిజన్, రామగుండం, పాముల పేటలో నిరుపేద మహిళ స్వర్గీయ ఇందారపు సునీత అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలియజేసిన సందర్భంలో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. తదనంతరం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ మేరకు రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరి ప్రసాద్ అధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్వర్గీయ ఇందారపు సునీత W/O రాంబాబు ఇంటికి వెళ్లి మాతృవియోగంతో బాధపడుతున్న వారి పిల్లల్ని పరామర్శించి వారికి బియ్యం బస్తా తో పాటు 5000/- వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగినది. హరి ప్రసాద్ మాట్లాడుతూ వారి పిల్లలకు ధైర్యం చెబుతూ పిల్లల చదువు విషయంలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఎల్లవేళలా అండగా ఉంటారని ఏవైనా ఇబ్బందులు తలెత్తుతే మమ్మల్ని సంప్రదించండి అని ధైర్యాన్ని చెప్పడం జరిగినది.
ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్, డివిజన్ అధ్యక్షులు బొద్దుల శంకర్,పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు సాదు రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈదునూరి వెంకట్,బింగి రవి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App