TRINETHRAM NEWS

ఎట్టకేలకు స్పందించిన అధికారులు

కెపిహెచ్బి టెంపుల్ బస్టాండ్ ఎదురుగా ఈడబ్ల్యూఎస్ లో 66 గజాల్లో ఎనిమిది ఫ్లోర్లు నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు మేరకు గత నెలలో కేపీహెచ్బీ మూసాపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డింగును సీజ్ చేయడం జరిగింది. తాజాగా అదే భవనంలో పనులు చేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శనాలు వినిపిస్తున్నాయి.

సీజ్ చేసిన భవనంలో పనులు చేయడం పై రెండు నెలల క్రితం వసంత నగర్ లో నిర్మాణ కార్మికులపై కేసులు పెట్టిన అధికారులు, ఇక్కడి భవన నిర్మాణదారుడుపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారో అర్థం కావడంలేదని స్థానికుల ఫిర్యాదు మేరకు మంగళవారం రోజు అధికంగా నిర్మించిన అక్రమ అంతస్తులను మున్సిపల్ సిబ్బంది కూల్చడం జరిగింది. ఇకపై నుండి అయినా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Officials who finally responded