
త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా,అనపర్తి నియోజకవర్గం,అనపర్తి. అధికారులు మానవత్వంతో పనిచేయాలి అధికార పార్టీకి తోత్తులుగా కాదు.. అర్హుల పింఛన్లు ఆపితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ సొమ్మును అధికారుల నుండి వడ్డీతో సహా వసూలు చేస్తాం…
కాదా నాగ గిరీష్ వికలాంగ పెన్షన్ సొమ్ము అందించాలి
అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
అనపర్తి: అధికారులు మానవత్వంతో పని చేయాలి తప్ప రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయకూడదని అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వికలాంగ పెన్షన్ నిలిపివేసిన అనపర్తి సావారంకు బీసీ కులానికి చెందిన కాదా నాగ గిరీష్ పెన్షన్ సొమ్ము వెంటనే పంపిణీ చేయాలని నాగగిరీష్ కుటుంబ సభ్యులు పలువురు కలిసి అనపర్తిమండల అభివృద్ధి అధికారి కార్యాలయం సూపరిండెంట్ కి గురువారంవినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సుమారు 15 సంవత్సరాల పైగా కాదా నాగ గిరీష్ వికలాంగు పెన్షన్ పొందుతున్నారని అతని వికలాంగ సర్టిఫికెట్ 2024లో కూడా ఫైనల్ రీ వెరిఫికేషన్ అయిందని90 శాతం వికలాంగత్వం డాక్టర్ లు నమోదు చేశారనికొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు 15000 రూపాయలు పింఛన్ కు నాగగిరీష్ అర్హుడయ్యాడని అయితే ఇటీవల ఇతని పెన్షన్ సొమ్ము నిలుపుదల చేయడంతో తన కుటుంబ సభ్యులు పలుమార్లు స్థానిక మండల అభివృద్ధి అధికారిని కలిశారని అయితే ఈయన వికలాంగత్వంపై కొంతమంది అధికార పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారని అందుకే మరల రీవెరిఫికేషన్ నిమిత్తం పెన్షన్ నిలుపుదల చేశామని చెప్పడంతో జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ లో ఈ విషయంపై నాగ గిరీష్ వినతి పత్రం అందించగా దానిపై ఒకరోజు అధికారుల బృందం మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారని కలెక్టరేట్ అధికారులు సమాధానమిచ్చారు అయితే ఏ అధికారి కూడా నాగగిరీష్ ఇంటిని సందర్శించకుండా లబ్ధిదారుడు సంతకం పెట్టడానికి నిరాకరించాడని అధికారుల సొంతంగా వ్రాసుకుని అర్జీలు కూడా క్లోజ్ చేసే పరిస్థితిలో వ్యవహరిస్తున్నారని, ఒకవేళ అధికారులు నాగగిరీష్
ఇంటికి వచ్చి సందర్శించిన ఫోటోలు, వీడియోలు ఉంటే బయట పెట్టండని అని,ఇలా పక్షపాతంతో అధికారులు పనిచేయడం సరికాదని, పైగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనపర్తి నియోజకవర్గం లో అధికార పార్టీ నాయకులు ఒక కొత్త సాంప్రదాయానికి నాంది పలికారని అదే సాంప్రదాయాన్ని మేము కూడా అనుసరిస్తామని వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ అధికారులైతే పక్షపాతంగా పనిచేసే అర్హుల పెన్షన్లులు నిలిపివేస్తున్నారో అటువంటి అధికారులు రాష్ట్రంలో తర్వాత కాలంలో ఎక్కడ పని చేసిన కూడా ఈరోజు లబ్ధిదారు జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా వసూలు చేస్తామని అధికారుల నుండే వసూలు చేస్తామని, అధికార పార్టీ నాయకులు ఫిర్యాదు చేస్తే వారి ఫిర్యాదు పై అర్హులకు అన్యాయం చేస్తే అన్యాయంగా చాలామంది అధికార పార్టీ నాయకులు పెన్షన్లు పొందుతున్నారని వాటిపై కూడా మేము ఫిర్యాదు చేస్తే మీరు సరిగా తీసుకుంటారా అని అధికారులను ప్రశ్నించారు.
బిసి కులానికి చెందిన నాగగిరీష్ కి న్యాయం జరగకపోతే అవసరమైతే ఉద్యమానికైనా సిద్ధం అని అధికారులను డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అంసూరి సూర్యనారాయణ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కర్రిదాసు,అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, అనపర్తి పట్టణ వైయస్సార్ సిపి కన్వీనర్ నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఏడుకొండలు, కొండేటి భీమేశ్వర స్వామి, శ్రీనివాస్, జారాపు వెంకట అచ్చయ్య, జె.వెంకటేష్, కే. దుర్గారావు,జి. వీర రాఘవులు కాదాలోవరాజు,డి రాధాకృష్ణ,యేసు, గిరీష్ కుమార్ కుటుంబ సభ్యలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
