TRINETHRAM NEWS

Office of the District Medical and Health Officer, Peddapally

సీజనల్ వ్యాదులను కట్టడికి వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలి.

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలో బారీ వర్షాలు పడుతున్నందు వలన వివిద సీజనల్ వ్యాదులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు వ్యక్తిగత ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి, డా. కె. ప్రమోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ వర్షాల ప్రబావం వలన వరదలు వచ్చుచున్నందున త్రాగునీరు కలుషితం అయ్యె అవకాశం ఉన్నందున కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని, నిల్వ ఉంచిన ఆహారాలను స్వీకరించవద్దని, బజారులో లబించే తినుబండారాలను తినవద్దని అవి కలుషితం అయ్యే అవకాశం ఉన్నదని అన్నారు. కలుషిత నీరు మరియు కలుషిత ఆహారం తీసుకుంటే నీళ్ళ విరోచనాలు మరియు టైఫాయిడ్ లాంటి వ్యాదులు ప్రబలే అవకాశం ఉన్నది అని అన్నారు.

వర్షాల అనంతరం నీటి నిల్వలలో దోమలు గుడ్లు పెట్టడం వలన దోమలు పెరిగి కీటక జనిత వ్యాదులైన చికున్ గున్యా, డెంగ్యూ, మలెరియా లాంటి వ్యాదులు ప్రబలే అవకాశం ఉన్నందున ఇంటి పరిసరాలలో ఉన్న నీటి నిల్వలు అనగా కొబ్బరి చిప్పలు, నీటి సీసాలు, నీటి గోళాలు మొదలగు నీటి నిల్వ ఉండే పాత్రలలో దోమల లార్వాలు పెరుగుతున్నయా చూసి అట్టి నీటిని తొలగించాలి అని అన్నారు.

అదేవిధంగా డెంగ్యూ వ్యాధి కలిగించే దోమలు పగటిపూట కుట్టును కావున ప్రజలు, వారి పిల్లలు పూర్తిగా శరీర భాగాలను కప్పి ఉంచే దుస్తులను ధరింప చేయాలని, ఇంటి వద్ద ఉండే గుబురైన పిచ్చి మొక్కలను తొలగించాలని అని అన్నారు. సాయంత్రం చీకటి పడే సమయం ఇంటిలోకి దోమలు రాకుండా తలుపులు, కిటికీలు మూసి ఉంచుకునేటట్టు చూడాలి అని అన్నారు.

గ్రామాలలో ఏ ఎన్ ఎం లు, ఆశ కార్యకర్తలు జ్వరం సర్వే మరియు లార్వాలు నిల్వయుండు నీటి ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టినప్పుడు వారకి ప్రజలు సహకారించాలని కోరారు. వారానికి ఒకసారి విదిగా డ్రైడే పాటించాలని అని అన్నారు. జ్వరాలు, నీళ్ళవిరోచనాలు మరియు ఇతరత్రా సీజనల్ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పడు సమీప ఆరోగ్య కేంద్రం లేదా ప్రభుత్వ ఆసుపత్రులలో సంప్రదించాలని అని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Office of the District Medical and Health Officer, Peddapally