జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం,
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, డా. అన్నా ప్రసన్న కుమారిఅధ్యక్షతన శిశు మరణాల సమీక్ష కమిటి సమావేశం జరిగినది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ ఇండియాలో 1000 సజీవ జననాలకు 25, తెలంగాణలో 23 కాగా మన జిల్లాలో 7 మంది శిశు మరణాలు జరుగుతున్నాయి అని అన్నారు. జిల్లాలో ఏప్రిల్ 2024 నుండి నవంబర్ 2024 వరకు జరిగిన శిశు మరణాలు 35 నమోదు కాగా వాటిలో 6 శిశు మరణాల కేసులను ఎంపిక చేసి వాటి పైన సమీక్ష నిర్వహించడమైనది. వీటిలో నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, బరువుతక్కువగా పుట్టిన పిల్లలు, జ్వరం వచ్చి ఫిట్స్ తో చనిపోయిన పిల్లలు, ఉమ్మ నీరు మింగడం వలన చనిపోయిన పిల్లలు, కొందరు పాలు పట్టిన తరువాత తల్లి సరిగా భుజం పైన వేసుకొని శిశువును చేతితో తట్టకపోవడం వల్లన పొలిమారి పాలు శ్వాస నాళంలోకి పోవడం వలన చనిపోయారు. తల్లికి బి.పి. పెరగడం వలన చనిపోయిన శిశువులు, కావున గర్భిణికి సరియైన పోషణ అందిస్తూ, మానసికంగా ఆనందంగా ఉంచి బి.పి పెరగకుండా చూసుకోవాలని తల్లులకు అవగాహన కల్పించాలి అని, శిశువులలో ఏమైనా ప్రమాద చిహ్నాలను గుర్తించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళె విదంగా ప్రోత్సాహించాలని, భవిష్యత్తులో జిల్లాలో పిల్లల మరణాలు తగ్గాలని వైద్యాధికారులను, ఎ.ఎన్.ఎం.లను, ఆశాలను ఆదేశించారు.
ఈ సమావేశంలో డా. బి. కిరణ్ కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ (సిహెచ్ అండ్ ఐ), మాతా శిశు కేంద్రం నుండి డా. శ్రీధర్, డి.సి.హెచ్.ఎస్, డా. టి. రవిందర్, పిడియాట్రిషియన్, డా. స్రవంతి, గైనాకాలజిస్ట్, శ్రీమతి వి. పద్మ, నర్సింగ్ సూపరింటెండెంట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన కోలనూర్, ఎలిగేడ్, రాఘవాపూర్, గద్దలపల్లి మరియు గర్రెపల్లి ల వైద్యాధికారులు మరియు సిబ్బంది పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App