OCP Three Blastings and Rainstorms Level Wall of Dalit Poor Woman’s House
శనిగరపు ఎల్లమ్మ కుటుంబాన్ని సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం ఆదుకోవాలి
నిరుపేద కుటుంబానికి సింగరేణి క్వాటర్ లేదా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని లోని విట్టల్ నగర్ మీసేవ ముందుగా నిరుపేద దళిత కుటుంబం నివసిస్తున్న తరుణంలో శుక్రవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు శనిగరపు ఎల్లమ్మ ఉంటున్న ఇల్లు ప్రధాన ద్వారం గోడ కూలిపోవడం బాధాకరమైన విషయం అని మద్దెల దినేష్ అవేదన వ్యక్తం చేశారు.
అనంతరం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్ నిరుపేద దళిత కుటుంబాన్ని పరామర్శిస్తూ కూలిపోయిన ఇంటి గోడను పర్యవేక్షించి ఆయన మాట్లాడుతూ ఆర్జి-2 పరిధిలోని ఓసిపి-3 బ్లాస్టింగ్ ల వల్ల అనేక రకాలుగా నిరుపేదలు వేసుకున్నటువంటి చిన్నాచితక ఇండ్లు గుడిసెలు భారీ బీటలు పడుతుండడంతో ఒకవైపు పది రోజుల నుండి ఏకదాటిగా వర్ష బీభత్సవం సృష్టిస్తున్న తరుణంలో నేడు శనిగరపు ఎల్లమ్మ ఇల్లు గోడ నేలమట్టడం కావడంతో అదృష్టం కొద్ది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కావున నేడు కుటుంబ సభ్యులు తలదాచుకోనికి ఇల్లు ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నోసార్లు సింగరేణి అర్జీ-2 అధికారులకు, మరియు జిఎం మరియు డి జే ఎం ఎస్ వెంకన్న గార్లుకు గతంలో వచ్చినప్పటికీ కూడా వారికి విన్నవించడం జరిగిందన్నారు, అయినప్పటికీ కూడా నిరుపేద కుటుంబానికి ఎలాంటి పునరావాసం కల్పించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కావున సింగరేణి యాజమాన్యం స్పందించి తక్షణమే పునరావిసం కింద శనిగరపు ఎల్లమ్మ కుటుంబానికి సింగరేణి ద్వారా ఒక క్వాటర్ అలాట్ చేయాలని లేదా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గౌరవ శాసనసభ్యులు మక్కాన్సింగ్ గారు దృష్టిలో ఉంచుకొని వారికి డబుల్ బెడ్ రూమ్ అయిన కేటాయించాలని దినేష్ పేర్కొన్నారు.
అదేవిధంగా రెవెన్యూ అధికారులు తక్షణమే ఆ ఇంటిని పరవేక్షించి వారికి ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవాలని మద్దెల దినేష్ అధికారులను కోరారు.
అదేవిధంగా ఇంకోవైపు గద్దల లింగమూర్తి ఇల్లు కూడా పూర్తిగా నేలమట్టం కావడంతో నిరుపేద కుటుంబమైనటువంటి లింగమూర్తి ఇల్లు లేక అనేక రకాలుగా పిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి కూడా సింగరేణి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App