TRINETHRAM NEWS

Trinethram News : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే.

ఏప్రిల్ 19వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభమవుతుండగ, జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే… ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.

ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది అని పేర్కొన్నారు. ఏప్రిల్ 26న స్కూటినీ జరుగుతుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది అని తెలిపారు.

మే 13న రాష్ట్రంలో పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని నెల్లూరు పర్యటనలో ముకేశ్ కుమార్ మీనా వ్యాఖ్యానించారు.