TRINETHRAM NEWS

హామీలు ఇవ్వటం కాదు. హామీలు అమలు చెయ్యాలి

( గిరిజన సంఘం కార్యదర్శి పొద్దు బాల్ దేవ్)

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 13: 1/70 చట్టం పరిరక్షణకై పోరాడి విజయం సాధించిన ఆదివాసులు రాష్ట్ర ప్రభుత్వం హామీలు చేయాలి. ఈ నెల 24 నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆదివాసులకు 100 శాతం, రిజర్వేషన్ నియామక చట్టం చేయాలి – ఆదివాసి అఖిలపక్ష ప్రజాసంఘాలు ఈనెల 11వ తేదీన జరిగిన రాష్ట్ర మన్యం బంద్ విజయవంతం చేసి పోరాడి విజయం సాధించిన ప్రతి ఒక్కరికి ఆదివాసి అఖిలపక్ష ప్రజాసంఘాలు ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాము.
అరకు వేలి ఆదివాసి గిరిజన సంఘం కార్యాలయంలో ఆదివాసి ఐక్యపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలో సురేంద్ర అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ 1/70 చట్టం పరిరక్షణకై 11వ తేదీన జరిగిన రాష్ట్ర మన్యం బంద్ ఆదివాసి ప్రజానీకం ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులు వర్తకులు ఆదివాసి శ్రేయోభిలాషులు ఆదివాసీ ప్రజా సంఘాలు రాష్ట్ర మన్యం బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఆదివాసులు ఐక్య పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిందని 1/70 చట్టం పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించడం హర్షణీయమని 1/70 చట్టం పటిష్టంగా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈనెల 24 తేదీ నుండి జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో 1/70 చట్టం పరిరక్షణకై చర్చించాలని ఆదివాసి ప్రాంతంలో 100% రిజర్వేషన్ నియామక చట్టం చేయాలని ఆదివాసి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని అనంతగిరి మండలంలో గుజ్జల చిట్టెంపాడు లో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నవయుగ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన అనుమతులు తక్షణమే రద్దు చేయాలని పాడేరు మెడికల్ కళాశాలలో 100% ఆదివాసులతో ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదివాసి ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి కోసం రోడ్లు, వంతెనలు నిర్మాణాలు చేయాలని ఆదివాసి ప్రాంతంలో కాఫీ,మిరియాలు, చింతపండు అడ్డాకులు ఇతర అటవీ ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో దండకారణ విమోచన సమితి జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర ప్రసన్నకుమార్ పెసా కమిటీ ఉపాధ్యక్షులు ఎం రమేష్ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు పి రామన్న కే రామారావు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 12 at 18.20.26
Poddu Bal Dev