
చిన్నారుల నిరసన…
పట్టించుకోని అధికారులు…
కొనసాగుతున్న నిర్మాణం…
త్రినేత్రం న్యూస్ : మండపేట. మండపేట సప్తగిరి ధియేటర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం వద్దంటు చిన్నారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్లే కార్డులు చేతబూని ఇక్కడ మద్యం దుకాణం వద్దని విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల పలు ప్రజా సంఘాలు ఆద్వర్యంలో సత్య శ్రీ జంక్షన్ లో ధర్నా చేపట్టారు.
సామాజిక ఉద్యమ నేత దుళి జయరాజు, సి ఐ టి యు నేత కృష్ణ వేణి లు మద్యం దుకాణం కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కాగా ఆ ప్రదేశం లో షాప్ ఏర్పాటు కు భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆందోళన, నిరసన లను ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
