
తేదీ : 23/02/2025. ఆళ్లగడ్డ : (త్రినేత్రం న్యూస్); నంద్యాల జిల్లా , రాప్తాడు నియోజకవర్గం, ఆళ్లగడ్డ మండలం లో రసాయనక ఎరువులు వద్దు , సేంద్రియ ఎరువులు ముద్దు అంటూ నవభారత్ ఫర్టిలైజర్స్ యల్. య ల్. పి ప్రతినిధులు అనడం జరిగింది. మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ బి. కృష్ణమూర్తి యం. యం. డి బి. టి రామానాయుడు మరియు కృష్ణ, దస్తగిరి ,మధుబాబు రైతు సోదరులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయనిక ఎరువులు వాడటం వలన భూసారం దెబ్బతిని వాతావరణం కలుషితమవుతుందన్నారు.
అదేవిధంగా పంటలకు చీడపురుగులు పెరిగిపోయి దిగుబడి తగ్గిపోద్ది అని పేర్కొన్నారు. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల భూసారం పెరగడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించవచ్చు, రైతులు పండిస్తున్న వివిధ పంటలలో సస్య రక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు , మందులు వాడటం నానాటికి తిరిగింది అన్నారు. వీటి ప్రభావం వల్ల మనకు తెలియకుండానే భూమిలో ఉన్న జీవరాసులపై అధికంగా ఒత్తిడి పెరగడంతో పాటు భూమిలోని జీవరాసులలో అతి ముఖ్యం సముదాయకమైన సూక్ష్మజీవులు వాటి సంఖ్య తగ్గుతుంది.
రైతులకు పెట్టుబడి విషయంలో అధిక భారం పడుతుందన్నారు. గత పది సంవత్సరాలుగా సేంద్రియ ఎరువులు రైతులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. విజయ గ్రోమిన్, ఖజానా ధ్రువ రూప, ఔషధ గుణాలు కలిగినటువంటి జేమ్స్ బాండ్, విభ, విశిష్టి , గ్రోత్ ప్రమోటర్స్, విం జముల్ , వింజెమ్ జి వేరు కుళ్ళు, తెగుళ్లను ఈ గోల్డ్ , సుప్రీం సూక్ష్మ పోషకాల నివారణకు పోలియో సాయిలుకు విజేత మోర్ 69 వజ్రం , కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ లోపాల నివారించే దోస్త్ సి యం యస్, పటాస్ , విప్రో మ్ 5 లను పంటకు వాడి భూమిలోని మిత్ర పురుగులు , సూక్ష్మజీవులను అభివృద్ధి చేసి మొక్కలకు కావలసిన పోషకాలను అందించడంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుతాయని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల .సునీత. శ్రీరామ్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ. శ్రీనివాసరావు పెనుగొండ ఎమ్మెల్యే సవిత, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, సురేంద్ర పుట్టపర్తి ఎమ్మెల్యే, పల్లె. సింధూర రెడ్డి అనంతపురం జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు ఏ.డి.ఏ రవికుమార్ , పంటలు, గిట్టుబాటు ధరలపై కంపెనీ ఉత్పత్తుల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
