Trinethram News : గుజరాత్:మార్చి04
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.
గుజరాత్‌లోని జామ్ నగర్లో 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ వేడుకల్లో ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ తన సంప్రదాయ నృత్యంతో అందరినీ ఆకట్టుకున్నారు.
రాధిక మర్చంట్‌ను అంబానీ కుటుంబంలోకి ఆహ్వాని స్తూ.. విశ్వంభరి దేవీ స్తోత్రంపై నృత్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది…