పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్
ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదే
బోర్డును సాధించిన అరవింద్ కు అభినందనలు
పసుపు బోర్డుకు సహకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ధన్యవాదాలు
పసుపు బోర్డు వల్ల ఈ ప్రాంత రైతులకు అనేక ప్రయోజనాలు
పసుపు రైతులకు గిట్టుబాటు సమస్యే ఉండదు
పసుపు బోర్డుకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం
బోర్డు సాధనకు పోరాడిన పసుపు రైతులందరికీ హ్యాట్సాఫ్…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
నిజామాబాద్ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న బండి సంజయ్
Trinethram News : Telangana : నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డ అరవింద్ అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. బోర్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి పీయూష్ గోయల్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీ నుండి వర్చువల్ గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోని తన కార్యాలయం నుండి వర్చువల్ గా హాజరై ప్రసంగిస్తూ బోర్డు ఏర్పాటు కోసం క్రుషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే…..
అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రైతుల పండుగ. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు ఇయాళ శుభవార్త అందించిన మహనీయుడు ప్రధాని నరేంద్రమోదీ, సహకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు, ఈ బోర్డు ఏర్పాటులో కర్త,కర్మ, క్రియగా ఉంటూ మొండిపట్టుతో విజయం సాధించిన ఎంపీ ధర్మపురి అరవింద్, బోర్డు ఛైర్మన్ గా నియమితులైన పల్లె గంగారెడ్డికి, స్థానిక ఎమ్మెల్యేలకు, పసుపు రైతులకు అభినందనలు.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఈ శుభ ఘడియల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో పసుపు బోర్డు కోసం 178మంది పసుపు రైతులు లోక్ సభ ఎన్నికల్లో నామినేషన్లు వేసి పసుపు బోర్డు అంశాన్ని జాతీయస్థాయిలోకి తీసుకెళ్లారు. ‘‘బీజేపీ ఎంపీగా గెలిచిన తరువాత పసుపు బోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తా’’ నని ధర్మపురి అరవింద్ రాతపూర్వకంగా హమీ ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డ ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రత్యేక అభినందనలు.
ఎందుకంటే పసుపు బోర్డు ఏర్పాటువల్ల ఈ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగబోతున్నయ్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కలగబోతున్నయ్. పసుపు ఉత్పత్తుల ధరను బోర్డు నిర్ణయిస్తుంది. పసుపు దిగుబడి ఎక్కువైనా గిట్టుబాటు ధర రాదనే బాధే ఉండదు. పసుపు బోర్డే రైతు ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసి వాటిని ప్రత్యేక స్టోరేజీల్లో ఉంచుతుంది. బ్రాండింగ్, ప్రమోషన్ స్కీమ్స్, ప్యాక్కింగ్ తోపాటు జాతీయంగా, అంతర్జాతీయ ఎగుమతులను చేసే అవకాశముంది.
ప్రతి ఏటా పసుపు బోర్డుకు కేంద్రం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తుంది. ప్రక్రుతి వైపరీత్యాలవల్ల పంట నష్టపోతే రైతులు నష్టపోకుండా పంట బీమాకు చర్యలు తీసుకుంటుంది. క్వాలిటీ డిపార్ట్మెంట్ ఏర్పాటు ద్వారా నిరంతరం క్వాలిటీ చెక్ మరియు క్వాలిటీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటారు. అంతిమంగా బోర్డు ఏర్పాటుతో పసుపు పంటను పండిస్తున్న రైతులకు మంచి రోజులు రాబోతున్నాయని తెలియజేసుకుంటూ… మీ అందరికీ మరోసారి సంక్రాంతి శుబాకాంక్షలు తెలియజేస్తున్నా…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App