NCP Party North Telangana Central Office
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని పట్టణంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మొదటగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూలమాల వేసి తరువాత జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, జాతీయ గీతాలాపన చేశారు.
ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ “1947 ఆగష్టు 15 రోజునుండి భారత దేశ ప్రజలు స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకుంటుంటె, తెలంగాణ ప్రజలు మాత్రం నిజాంల నిరంకుశ పాలన క్రింద నలిగిపోయారని, రజాకార్ల అకృత్యాలకు తెలంగాణ మహిళలు బలైపోయారని, అలాంటి సమయంలో భారతదేశ మొట్టమొదటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో చేపట్టి 17 నాడు నిజాంను గద్దెదించి, తెలంగాణ ప్రజలకు నిజాంనిరంకుశ పాలన నుండి విమోచనాన్ని కలిగించారని, కానీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించకుండా, ప్రజాపాలన దినోత్సవం గా జరపడం తెలంగాణ సాయుధ పోరాటాన్ని, చరిత్రను వక్రీకరించడమేనని”. అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర, రాష్ట్ర నాయకులు సుంకె రాజు నేత, జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు, గుళ్లపల్లి రాజ్ కుమార్, నాగుల శివకుమార్, మొలుగూరి మహేష్, వెంగళ బలరాం రెడ్డి, మోడం సదానందం గౌడ్, గంజి భస్కర్, సిద్దం శ్రీధర్, అనుముల్ల రాం రెడ్డి, కన్నూరి రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App