AITUC : జులై 09 న దేశవ్యాప్త సమ్మె డిప్యూటీ సూపరిండెంట్ విశ్వేశ్వర్ రెడ్డి కి సమ్మె నోటీసు అందజేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు

TRINETHRAM NEWS

మంచిర్యాల జిల్లా. 03 జూలై త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి 4 కోడ్ లను అమలు చేయడం కేవలం వ్యాపార వర్గాలకు వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు మాత్రమే ఉపయోగపడతాయని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని జులై 09 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. NHM లో నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన తెలుపుతూ విధుల్లో పాల్గొంటారు.నేషనల్ హెల్త్ మిషన్ (NHM) లో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ఇతర రాష్ట్రాలలో రెగ్యులర్ చేస్తున్న విధంగా ఒక టైం పీరియడ్ 10 సంవత్సరాలు పూర్తి చేసిన వారందరినీ రెగ్యులరైజ్ చేయాలి.
2018లో జీవో నెంబర్ 510 ద్వారా నష్టపోయిన NHM ఆల్ క్యాడర్స్ ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్సేషన్ చేసి బేసిక్ వేతనం అమలు చేయాలి. 2018 లో PRC విడుదల చేశారు దానికి సంబంధించిన 7 నెలల ఏరియర్స్ బకాయిలు వెంటనే ఇవ్వాలి కొత్త లేబర్ కోడ్‌లు నాలుగు 1)వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, 2)సామాజిక భద్రతా కోడ్ మరియు 3)వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు 4)పని పరిస్థితుల కోడ్.
ఈ నాలుగు కోడ్ లు దేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని ఉద్యోగులను వారి హక్కులను కోల్పోయే విధంగా మాత్రమే ఉంటాయని ఇది కేంద్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలకు బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనటువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు,నేషనల్ హెల్త్ మిషన్ ఞ్చమ్ సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దేవనబోయిన బాపు,కళావతి, శ్రీవాణి,భాగ్య లు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nationwide strike on July

You cannot copy content of this page

Scroll to Top