TRINETHRAM NEWS

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు, విద్యుత్ విలువైనది వృధా కాకుండా కాపాడుకుందాం.

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్. 18 :

అరకులోయ మండలంలోని విద్యుత్ ఉద్యోగులు, జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యుతు ఇంధన పొదుపు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమం అరకు వేలి విద్యుతు శాఖ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు పాఠశాల విద్యార్థి ,విద్యార్థినులు తో విద్యుత్ పొదుపు నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అప్పారావు, డిప్యూటీ ఇంజనీరు సురేష్ కుమార్, లు మాట్లాడుతు “ఇంధనా పొదుపు ప్రగతికి మలుపు” అని విద్యుతు ఆదా చేద్దామని కోరారు. ప్రతి ఒక్కరూ విద్యుతుని ఆదా చేయాలని విద్యుత్ వినియోగించేటప్పుడు ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో,అరకు వేలి డిఈ సురేష్ కుమార్, ఏఈ సత్యనారాయణ, లైన్ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య, లైన్మెన్లు రాంప్రసాద్, మంగరాజు, బుద్దు, దాసు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App