వాషింగ్టన్: అంతరిక్ష రేసులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు అమెరికా కీలక చర్యలు చేపడుతోంది. మరోసారి మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టేందుకు సిద్ధమైన నాసా .. అంతకంటే ముందు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు వరుసగా ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల ఓ ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో చేపట్టిన ల్యాండర్ ప్రయోగం విఫలమవగా.. తాజాగా మరో లూనార్ ల్యాండర్‌ను ప్రయోగించింది.
హ్యూస్టన్‌కు చెందిన ఓ కంపెనీ అభివృద్ధి చేసిన ల్యాండర్ బుధవారం అర్ధరాత్రి నింగిలోకి దూసుకెళ్లింది. నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ‘స్పేస్ఎక్స్’కు చెందిన ఫాల్కర్ రాకెట్ ఈ ల్యాండర్‌ను మోసుకెళ్లింది. అన్నీ అనుకూలిస్తే ఒకరోజు చంద్రుడి కక్ష్యలో తిరిగిన అనంతరం ఫిబ్రవరి 22న ఇది జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగనుంది.
చంద్రుడి ఉపరితలంపై ఉన్న పరిస్థితులను ఇది అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని నాసాకు పంపించనుంది. భవిష్యత్తులో చేపట్టబోయే ఆర్టెమిస్ యాత్రకు ఈ ప్రయోగం కీలకమని అమెరికా చెబుతోంది. కాగా.. దీనికంటే ముందు ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ ప్రైవేటు సంస్థ రూపొందించిన పెరిగ్రీన్ ల్యాండర్‌ను గత నెల నింగిలోకి పంపగా.. అది విఫలమైంది. ఇంధన లీక్ కారణంగా వ్యోమనౌక కీలక ప్రొపెల్లెంట్‌ను కోల్పోయింది. దీంతో చంద్రుడిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని కంపెనీ విరమించుకుంది.
1969లో అపోలో 11 రాకెట్లో వెళ్లిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్, మైఖేల్ కాలిన్స్ జాబిల్లిపైకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1972 వరకు ఆరుసార్లు మానవసహిత జాబిల్లి యాత్రలు, పలుమార్లు మెషిన్ ల్యాండర్లను నాసా పంపించింది. ఇక, ఇప్పటివరకు అమెరికా, భారత్, జపాన్, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యాయి. అయితే, ప్రైవేటు కంపెనీలు ఇప్పటికీ ఈ ఘనత సాధించలేకపోయాయి. తాజా ప్రయోగంతో ఆ అరుదైన రికార్డు నెలకొల్పాలని హ్యూస్టన్ కంపెనీ భావిస్తోంది…
మరోసారి మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టేందుకు సిద్ధమైన నాసా
Related Posts
గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు
TRINETHRAM NEWS గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు Trinethram News : న్యూయార్క్: బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా…
Donald Trump : స్పేస్ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన ట్రంప్, మస్క్.. కానీ!
TRINETHRAM NEWS స్పేస్ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన ట్రంప్, మస్క్.. కానీ! Trinethram News : United States : అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk), డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ల…