Trinethram News : మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమంగా చెరువు భూమిని కబ్జా చేసి భవనాలు నిర్మిస్తే గౌరవ హై కోర్ట్ ఆదేశాల ప్రకారమే నిన్న కూల్చివేతలు జరిగాయని,దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి కి ఆపాదించడం సబబు కాదు అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ఈ రోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు తో కలిసి నిర్వహించిన పత్రికా సమావేశంలో పేర్కొన్నారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే 1300 ఎకరాల మేర ప్రభుత్వ భూములు కబ్జా చేసి సుమారు 25000 కోట్ల రూపాయలు దోచేసిన చరిత్ర బిఆర్‌ఎస్ నాయకులది అని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇలాంటివన్నీ గుర్తించి ప్రభుత్వ స్థలాలు,చెరువులు,కుంటలను కాపాడేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రభుత్వ స్థలాలను కాపాడుతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి,మేడ్చల్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్,కూకట్పల్లి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేశ్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదు – నర్సారెడ్డి భూపతి రెడ్డి
Related Posts
25న బీసీల సమరభేరి
TRINETHRAM NEWS 25న బీసీల సమరభేరి..!! జనగణనలో కులగణన చేపట్టాలిబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యTrinethram News : హైదరాబాద్, నవంబర్ 23 : జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు…
శ్రీ చైతన్య కాలేజీలో ఆగని ఆత్మహత్యలు
TRINETHRAM NEWS శ్రీ చైతన్య కాలేజీలో ఆగని ఆత్మహత్యలు హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి చాలామంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం అంటూ, వారి పిల్లలకు ఇష్టం లేకున్నా కార్పొరేట్ కళాశాలలో జాయిన్ చేసి లక్షల్లో ఫీజులు కట్టి వారి పిల్లలను…