నారా లోకేష్ సహకారంతో 80 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ
స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న నారా లోకేష్
శిక్షణ పొందిన “45”వ బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ
కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ చేసిన నియోజకవర్గ తెలుగు మహిళలు
మంగళగిరి టౌన్, ఫిబ్రవరి 10: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరి పట్టణం, మంగళగిరి రూరల్ మండలాల్లో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మంగళగిరి ఎమ్మెస్సెస్ భవన్ లో నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం సర్టిఫికెట్లు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. 45వ బ్యాచ్‌లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన 80 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతి కోసం, వారి జీవనోపాధి కోసం కృషి చేస్తున్న నారా లోకేష్ కు కుట్టుమిషన్లు అందుకున్న లబ్ధిదారులు ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి వింజమూరి ఆషాబాల మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నారా లోకేష్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళల ఆర్థికాభివృద్ధికి వెన్నుదన్నుగా స్త్రీ శక్తి కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. మహిళలు అంతా ఏకమై వచే ఎన్నికలలో నారా లోకేష్ ను అత్యధిక మేజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, మంగళగిరి పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి, మంగళగిరి పట్టణ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి వాసా పద్మ, నియోజకవర్గ తెలుగు మహిళ అధికార ప్రతినిధి యలమంచిలి పద్మజ, నియోజకవర్గ తెలుగు మహిళ కార్యదర్శి దామర్ల పద్మజ, మంగళగిరి నియోజకవర్గ అంగన్వాడి సెల్ ఉపాధ్యక్షురాలు మోతుకూరి సుజాత,ట్రైనర్ హసీనా తదితరులు పాల్గొన్నారు.