
Trinethram News : “సూటిగా… సుత్తి లేకుండా… విషయంపైనే మాట్లాడండి. విజ్ఞాన ప్రదర్శలు చేయొద్దు, సాధించిన ఫలితాలేంటో చెప్పండి” అని అధికారులు, మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. రెండు రోజులపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో చాలా విషయాలు ప్రస్తావించారు. కలెక్టర్లు, మంత్రులు నిత్యం ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. అప్పుడే నిజమైన సమస్యలు వాటి పరిష్కార మార్గాలు తెలుస్తాయని సూచించారు. ఏసీ గదుల్లో కూర్చుంటే సమస్యలు తెలియవని, పరిష్కార మార్గాలపై అవగాహన రాదని తెలిపారు.
అభివృద్ధి రాజకీయం రెండూ సమానంగా సాగలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఎక్కడ కూడా అధికారులకు ఇబ్బంది పెట్టే పనులు చేయడం మంచిది కాదని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు సూచించారు. తప్పుడు పనులు ప్రోత్సహించకుండా ప్రజాప్రతినిధి చెప్పే సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలను అలానే అమలు చేయకుండా మంచిది ఏదో ఆ ప్రాంతానికి ఏది సరిపోతుందో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఏదైనా పని కాలేదని తెలిస్తే వెంటనే స్పందించాలని నేరుగా బాధితులను కలవాలని సూచించారు. మంచి జరిగినప్పుడు ప్రజలకు తెలియజేయడానికి కూడా ముందుకు రావాలని సూచించారు. దాని ఘనత రాజకీయాలకు కూడా ఇవ్వాలని హితవుపలికారు. దీని వల్ల పని చేశామన్న సంతృప్తి కలెక్టర్లకు, ఐదేళ్ల తర్వాత ఓట్లు అడిగేందుకు వెళ్లే ప్రజాప్రతినిధికి ఇద్దరికీ బెనిఫిట్ ఉంటుందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
