TRINETHRAM NEWS

ప్రజల వద్దకే వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తా…

ప్రజలకు సుభిక్ష,సూపరిపాలన దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది…

పార్టీ పునర్నిర్మాణంలో అందరు పునర్ అంకితమై పని చేయాలి.

4వ డివిజన్ క్షేత్ర స్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే నాయిని..

రెండో అతిపెద్ద రాజధానిగా ఉన్న హనుమకొండ, వరంగల్, ఖాజిపేట నగరాన్ని మురికి వాడలు లేకుండా చేయడమే ప్రధాన ధ్యేయం అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 4వ డివిజన్ పెద్దమ్మగడ్డ, జ్యోతి బసు కాలనీ, యాదవ నగర్ కాలనీలలో విసతృ పర్యటన చేశారు. ఆయా కాలనీలలో పర్యటిస్తూ ప్రజలని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన సమస్యలకు శాశ్వత మార్గాలను ఏర్పాటు చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే నాయిని.ప్రతి వార్డులో స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల వద్ద పాలన కొనసాగిస్తానని తెలిపారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సుభిక్ష సుపరిపాలన అందించడం లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గం సహచర ఎమ్మెల్యేలందరం పనిచేస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ పథకాల అమలులో భేద తారతమ్యాలు లేకుండా ముందుకు వెళ్తున్నామని, పరిపాలనపరమైన సలహాలు ఇవ్వాల్సిన ప్రతిపక్షాలు నిత్యం ప్రజలను తప్పుదోవ పట్టించే పనిలో నిమగ్నమై ఉందని ఎద్దేవా చేశారు.

నాలుగో డివిజన్ పరిధిలో ఉన్న అంతర్గత రోడ్ల నిర్మాణమైన, సైడ్ డ్రైన్ ల నిర్మాణమైన, మంచినీటి మరియు విద్యుత్ సుందరి కరణ పనులన్నింటినీ దశలవారీగా చేసి  ప్రతి డివిజన్ నీ మోడల్ డివిజన్ గా అభివృద్ధి చేస్తానని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మానంలో కూడా నాయకులు కార్యకర్తలు సమన్వయంలోపం లేకుండా చూసుకుంటూ, అంకితభావంతో పనిచేయాలని కొత్త,పాత బేధాలు లేకుండా ముందుకు వెళ్లాలని హితవు పలికారు. వార్డులో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలను తుచా తప్పకుండ క్షేత్ర స్థాయిలో ఆచరకు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సీనియార్ కాంగ్రెస్ నాయకులు రాజేందర్, కుమార్ యాదవ్,
డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబేద్కర్ రాజు, మాజీ కార్పొరేటర్ బోడ డిన్న, నాయకులు తోట రమేష్, మొహమ్మద్ గౌస్, సోషల్ మీడియా మహేష్, శివ, తేజ, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Naini Rajender Reddy